జగన్ తీసుకున్న సంచలన నిర్ణయంపై ఉత్తరాదిలో మరీ ఇన్ని సెటైర్లా?

Friday, June 7th, 2019, 04:10:43 PM IST

వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు నిర్వహించిన మీటింగులో జగన్ తన క్యాబినెట్ లో ఉండే మంత్రుల జాబితాను విడుదల చేస్తారు అని అంతా అనుకుంటే జగన్ దానిని అందాకా హోల్డ్ లో పెట్టి ఉంచారు.అలాగే రాష్ట్రంలో మొత్తం ఐదుగురు డిప్యూటీ సీఎం లు ఉండబోతున్నారు అని జగన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే.

అయితే ఇక్కడ మాత్రం జగన్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం పై ఇక్కడ రాజకీయ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రసంశలు కురిపించగా ఉత్తరాది జనం మాత్రం ఈ వార్త విని ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తున్నారు.ఒక్క రాష్ట్రానికి ఐదుగురు డిప్యూటీ సీఎం లు అవసరమా అని కొందరు ఆ ఐదుగురికి దివ్యంగులు,ట్రాన్స్ జెండర్లకు అలాగే మహిళలకు కూడా కల్పించండి అంటూ అలాగే జగన్ తన డిప్యూటీ సీఎం లతో మీటింగుకు ఇలా వెళ్తున్నారు అంటూ వందలాది మంది ఉన్న ట్రైన్ ఫోటోను పెట్టి ట్రోల్ల్స్ చేస్తున్నారు.మరి జగన్ తీసుకున్న ఈ నిర్ణయంలో వారికి ఎలాంటి తప్పు కనిపించిందో వారికే తెలియాలి.