బ్రేకింగ్ : టీవీ9 రవిప్రకాష్ పరిస్థితి మరీ ఇంత దారుణంగా ఉందా!?

Monday, June 10th, 2019, 11:11:42 AM IST

ప్రజలు ఎవరికి ఓట్లు వెయ్యాలి వారిని ఎలా మభ్యపెట్టి కేవలం ఒకరిని మాత్రమే హైలైట్ చేస్తూ వారికన్నా గొప్ప వాళ్ళు ఇంకెవ్వరు లేరు అన్నట్టుగా చిత్రీకరించడంలో మన తెలుగు మీడియా ఒకడుగు ముందే ఉంటుంది.అందులోను కొన్ని చానెళ్లు అయితే మరీనూ అని సామాన్య ప్రజానీకం దుమ్మెత్తి పోస్తుంటారు.అయితే అలాంటి ఓ ఛానెల్ మాజీ సీఈఓ పరిస్థితి ఇప్పుడు అత్యంత దారుణంగా తయారయ్యిందని నెటిజన్స్ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.రవి ప్రకాష్ కోసం మన తెలుగు ప్రజలకు ఇప్పుడు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు.

అతని కోసం కనీస రాజకీయ అవగాహన ఉన్న ప్రతీ ఒక్కరికీ తెలుసు.ఒకప్పుడు ముఖ్యమంత్రి,పెద్ద పెద్ద ఆఫీసర్ల పక్కన కూర్చొని మాట్లాడిన రవి ప్రకాష్ ఇప్పుడు అతను చేసిన తప్పులు వల్ల తగిన శిక్ష అనుభవిస్తున్నాడని అంటున్నారు.అప్పట్లో ఎందరో గొప్పవారితో కలిసి ఉన్న ఇతన్ని ఇప్పుడు ఒక సాధారణ కానిస్టేబుల్ పక్కకు ఈడ్చుకుంటూ తీస్కెళ్ళిపోతున్నాడని వ్యాఖ్యానిస్తున్నారు.ఇప్పుడు ఇదే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కొంచం లేట్ అయినా సరే కాలం ఏం చెయ్యాలో అదే చేస్తుంది అని మరికొంతమంది ఈ విషయాన్ని చూపించి నవ్వుతున్నారు.