కాంగ్రెస్‌ను ఖ‌ల్లాస్ చేసిన కేసీఆర్ పంతం!

Friday, June 7th, 2019, 02:38:31 PM IST

కేసీఆర్ స‌చ్చుడో తెలంగాణ తెచ్చుడో..ఇది ఉద్య‌మ స‌మ‌యంలో గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం గొంతెత్తి అరిచిన స్లోగ‌న్‌. ఒక్క‌సారి ఫిక్స‌యితే దాని అంతు చూసే వ‌ర‌కు వ‌ద‌ల‌రాయ‌న‌. ఆ పంత‌మే అసాధ్యం అనుకున్న తెలంగాణ క‌ల‌ను సుసాధ్యం చేసి చూపించి ఎంపీగా, ఎమ్మెల్యేగా వున్న త‌న‌ని ఏకంగా ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. తెలంగాణ‌లో తిరుగులేని నాయ‌కుడిగా నిల‌బెట్టింది. తెలంగాణ ఇచ్చిన త‌రువాత త‌న‌ని అవ‌మానించిన కాంగ్రెస్‌, టీడీపీల‌ని తెలంగాణ‌లో భూస్థాపితం చేయాల‌ని కేసీఆర్ పంతం ప‌ట్టారు. అందుకు అనుగుణంగానే ముందు టీడీపీని భూస్థాపితం చేశారు. అందులోని కీల‌క నేత‌ల్ని త‌న పార్టీలోకి చేర్చుకున్నారు.

ఇక మిగిలింది కాంగ్రెస్‌. టీడీపీ ప్రాంతీయ పార్టీ దాన్ని నిర్వీర్యం చేయ‌డం ఈజీగా ఈయిపోయింది. కానీ కాంగ్రెస్ అలా కాదు. దీనికి పెద్ద స్కెచ్చే వేయాలి. అదే జ‌రిగింది. ఉద్య‌మం స‌మ‌యం నుంచే కాంగ్రెస్‌కు చెందిన కీల‌క నేత‌ల్ని త‌న వైపు తిప్పుకున్న కేసీఆర్ చిన్ని చిన్న‌గా కాంగ్రెస్ కూసాలు క‌దిలించ‌డం మొద‌లునెట్టారు ముంద‌స్తు ఎన్నిక‌ల్లో సీనియ‌ర్ల‌ని టార్గెట్ చేసి మ‌రీ ఓడించి కాంగ్రెస్‌కు నైతిక బ‌లాన్ని దూరం చేశారు. అదే అద‌నుగా కాంగ్రెస్ తరుపున 19 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులోంచి మెజారిటీ వ‌ర్గం 12 మంది తెరాస‌లో చేరేలా ప్యూహాలు ర‌చించారు. ఈ 12 మందిని తెరాస‌లో చేర్చుకుని సీఎల్పీని విలీనం చేసుకుని శాస‌న స‌భ‌లో కాంగ్రెస్‌కు ప్ర‌తిప‌క్ష హోదా లేకుండా చేసి త‌న పంతం నెగ్గించుకున్నారు. నిజంగా తెలంగాణ‌లో ఇదొక చ‌రిత్రే. జాతీయ పార్టీని ప్రాంతీయ పార్టీ విలీనం చేస‌కోవ‌డం చెప్ప‌డానికి విడ్డూరంగానే వున్నా అలాంటి అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసి దేశం నివ్వెర‌పోయేలా చేశారు. దీంతో తెలంగాణ‌లో కాంగ్రెస్ ఖ‌ల్లాస్ అయిన‌ట్లే న‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.