సాగర్ ఉపఎన్నికలో ఆధిక్యం కనబరుస్తున్న తెరాస!

Sunday, May 2nd, 2021, 02:10:09 PM IST


తెలంగాణ రాష్ట్రం లో నాగార్జున సాగర్ ఉపఎన్నిక కి సంబందించి ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ ఎన్నిక లో అధికార పార్టీ తెరాస అభ్యర్ధి ఆధిక్యం కనబరుస్తున్నారు. తొలి రౌండ్ నుండి 18 వ రౌండ్ వరకూ తెరాస అభ్యర్ధి నోముల భగత్ ఆధిక్యం కనబరుస్తున్నారు. 19 వ రౌండ్ ముగిసే సరికి తెరాస అభ్యర్ధి నోముల భగత్ 14,476 ఓట్ల మెజారిటీతో దూసుకు పోతున్నారు. రౌండ్ రౌండ్ కి తెరాస ముందంజ లో దూసుకు పోతుంది. కాగా రెండవ స్థానం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి ఉండగా, మూడవ స్థానం లో బీజేపీ అభ్యర్ధి రవి కుమార్ లు ఉన్నారు.

అయితే వరుసగా తొలి తొమ్మిది రౌండ్ లలో తెరాస అభ్యర్ధి ఆధిక్యం ప్రదర్శించగా, 10,11, 14 వ రౌండ్ లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి జానారెడ్డి ఆధిక్యం కనబరిచారు.