నాగార్జున సాగర్ ఉపఎన్నిక లో తెరాస అభ్యర్ధి నోముల భగత్ ఘన విజయం!

Sunday, May 2nd, 2021, 03:56:02 PM IST


నాగార్జున సాగర్ ఉపఎన్నిక లో ఎట్టకేలకు అధికార పార్టీ తెరాస కి చెందిన నోముల భగత్ 19,271 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. అయితే అధికార పార్టీ తెరాస కే ప్రజలు పట్టం గట్టారు. దివంగత ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మరణం తో నాగార్జున సాగర్ లో ఉపఎన్నిక అనివార్యం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యం లో ఏప్రిల్ 17 వ తేదీన ఈ ఎన్నికకు సంబందించి పోలింగ్ జరగగా, నేడు కౌంటింగ్ ప్రక్రియ జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ రెండవ స్థానానికి పరిమితం కాగా బీజేపీ కి డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. అయితే నోముల భగత్ ఘన విజయం తో పార్టీ శ్రేణులు , అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.