తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం – ఏంటో తెలుసా…?

Monday, October 21st, 2019, 09:54:48 PM IST

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెరాస ప్రభుత్వం తాజగా మరొక నిర్ణయాన్ని తీసుకుందని చెప్పాలి. ఇన్నిరోజులు కూడా అటు ఉప ఎన్నిక మరియు ఆర్టీసీ సమ్మెతో సతమమవుతున్న ప్రభుత్వం తాజగా తన నూతన నిర్ణయాన్ని ప్రకటించింది. కాగా జీహెచ్ఎంసీ రోడ్ల నిర్వహణపై తెరాస ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అయితే కొత్త రోడ్లు వేయడానికి మరియు ఇదివరకు వేసిన రోడ్లు పాడటం లేక గుంతలు పడటం లాంటివి పూర్తి చేసే పనిలో తెలంగాణ ప్రభుత్వం తాజా నిర్ణయాన్ని ప్రకటించింది. కాగా ఈ పనులకు కావాల్సిన టెండర్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించనుంది తెలంగాణ ప్రభుత్వం.

కాగా సమగ్ర రోడ్ల నిర్వహణ కార్యక్రమం కింద ఈ పనులను ప్రారంబించనున్నారు. జీహెఛ్ఎంసీ పరిధిలోని 709 కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్నటువంటి ప్రధాన రహదారుల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం నూతన టెండర్లు పిలవనుంది. అందులో ఇప్పటివరకు ఉన్నటువంటి రోడ్ల మీద ఏర్పడిన గుంతలు, కొత్తగ వేసే రోడ్లు, నూతన లేయర్ల నిర్మాణానికి వేరు వేరుగా టెండర్లకు పిలవనుంది ప్రభుత్వం. ఈమేరకు రానున్న 5 సంవత్సరాల వరకు ప్రైవేట్ ఏజెన్సీ లకే పనులను అప్పగించడానికి నిర్ణయం తీసుకుంది.