తెలంగాణాలో ఘోరం..కంటతడి పెట్టిస్తున్న కరోనా బాధితుని చివరి మాటలు!

Sunday, June 28th, 2020, 07:31:58 PM IST

ఇప్పటికే తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వైఫల్యంపై అనేక దారుణ విమర్శలు ఉన్నాయి. దీనితో అక్కడి ప్రభుతంపై తీవ్ర స్థాయి వ్యతిరేఖత మొదలయ్యింది. ఇప్పుడు అక్కడి ప్రభుత్వం కరోనా బాధితులను ఎంత దారుణంగా ట్రీట్ చేస్తుందో అందరికీ తెలిసేలా ఒక దారుణమైన విషాదకర ఘటన చోటు చేసుకుంది.

హైదరాబాద్ పరిధిలో ఓ 35 ఏళ్ల వ్యక్తి కరోనాతో పోరాడుతూ చికిత్స పొందుతున్నాడు. కానీ అతను ఉన్న ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి అదే ఆసుపత్రిలో చనిపోబోతున్నాను అని చివరి వీడియో పెట్టి గుండె బద్దలయ్యే వార్తను అందించాడు.

తనకు ఊపిరి ఆడట్లేదన్నా ఏ ఒక్కరూ తనని పట్టించుకోలేదని పైగా తనకున్న వెంటిలేటర్ ను కూడా తీసేశారని వీడియో తీసి పెట్టాడు. అంతే కాకుండా అందులోనే మళ్ళీ పెట్టమని అడిగినా ఇప్పటికే ఎక్కువసేపు పెట్టామని చెప్పి మాట్లాడారని..

మూడు గంటలు అవుతుంది ఎవరు స్పందించలేదు నేను చనిపోబోతున్నాను బాయ్ డాడీ అంటూ తన తండ్రికి కడసారి వీడ్కోలు చెప్పాడు. ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండగా ఈ వార్త విన్నవారు విస్మయానికి లోనవుతున్నారు.