బీజేపికి గెలుపు అందని ద్రాక్షానే

Friday, September 12th, 2014, 12:25:23 PM IST

trs

మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికలో తెరాస విజయం ఖాయమని, బీజేపి కూటమికి కనీసం డిపాజిట్లు కూడా దక్కవనిగజ్వేల్ తెరాస ఇన్ చార్జ్ దేవేందర్ అన్నారు. బీజేపి అభ్యర్ధికి డిపాజిట్లు దక్కించడం కోసం తెలుగుదేశం పార్టీ నేతలు డబ్బులు పంచుతున్నారని ఆయన అన్నారు. ఈ రోజు శామీర్ పేటలో హనీబర్గ్ రిసార్ట్ లో తెలుగుదేశం పార్టీకి చెందిన నేత ధర్మారెడ్డి వద్ద నుంచి పోలీసులు పెద్దమొత్తంలో డబ్బులను స్వాదీనం చేసుకున్నారు. ఈ సంఘటన అనంతరం తెరాస గజ్వేల్ ఇన్ చార్జ్ దేవేందర్ పై వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి గెలుపు కోసం సీమాంద్ర నేతలు పంపిన డబ్బును తెలుగుదేశం పార్టీ నేతలు పంచుతున్నారని ఆయన ఆరోపించారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా.. ఈ ఉప ఎన్నికలో తెరాస ఘనవిజయం సాధిస్తుందని దేవేందర్ దీమా వ్యక్తం చేశారు.