బాలిక‌ను లైంగికంగా వేదించిన టీఆర్ఎస్ లీడ‌ర్

Tuesday, February 21st, 2017, 05:43:05 PM IST


మైన‌ర్ బాలిక‌ను లైంగికంగా వేదించిన టీఆర్ఎస్ లీడ‌ర్‌ను క‌ట‌క‌టాల వెన‌క్కి తోశారు న‌ల్గొండ జిల్లా పోలీసులు. ప్ర‌స్తుతం తేరాస‌లో, పొలిటిక‌ల్ వింగ్‌లో ఇదో హాట్ టాపిక్‌. స‌ద‌రు నేత క్షుద్ర పూజ‌లు, గుప్త‌నిధులు పేరుతో బాలిక‌ను తీసుకెళ్లి అనుకున్న ప‌ని అవ్వ‌క‌పోవ‌డంతో రేప్ ఎటెంప్ట్ చేయ‌డంతో అస‌లు నేరం బ‌య‌ట‌ప‌డింద‌ని పోలీసులు చెబుతున్నారు. వివ‌రాల్లోకి వెళితే..

న‌ల్గొండ జిల్లా నార్క‌ట్‌ప‌ల్లి-బాజీకుంటకి చెందిన అధికార టీఆర్ఎస్ నాయ‌కుడు ఓ మైన‌ర్ బాలిక‌ను క్షుద్ర పూజ‌ల పేరుతో నిర్జ‌న ప్ర‌దేశానికి తీసుకెళ్లాడు. అక్క‌డ గుప్త‌నిధుల కోసం త‌వ్వ‌కాలు సాగించాడు. ఆ క్ర‌మంలోనే క్షుద్ర దేవ‌త‌ల ప్ర‌స‌న్న ం కోసం ఓ బాలిక‌ను తెచ్చారు. బాలిక‌ను పూజ‌ల కోసం ఉప‌యోగిస్తే త‌మ‌కు అద్భుత శ‌క్తులు వ‌స్తాయ‌ని భావించిన స‌ద‌రు నేత ఇలా చేశాడు. కానీ శ‌క్తులు కాదు క‌దా.. నిధులు కూడా ఏవీ బ‌య‌ట‌ప‌డ‌లేద‌క్క‌డ‌. దాంతో బాలిక‌పై త‌మ కామ‌వాంచ తీర్చుకునేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే ఆ బాలిక అక్క‌డినుంచి పారిపోయి వ‌చ్చి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు ద‌ర్యాప్తు చేసిన పోలీసులు స‌ద‌రు టీఆర్ఎస్ లీడ‌ర్‌ను, ఆయ‌న అనుచ‌రులైన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసి శంక‌ర‌మాన్యాల‌కు పంపారు.