దిశ హత్యోదంతం : వివాదాస్పదం అవుతున్న తెరాస నేత వాఖ్యలు

Wednesday, December 11th, 2019, 10:07:55 PM IST

ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం ఘటన పై అధికార పార్టీ మహిళా నేత కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతానికి ఆ వాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కాగా దిశ ఘటన పై కామారెడ్డి జెడ్పీ చైర్ పర్సన్, టీఆర్ఎస్ నేత శోభ కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. అయితే ఘటన జరగడానికి ముందు, తనకు ఆపద ఉందని తెలుసుకున్న సమయంలో తన చెల్లికి కాకుండా, తన తండ్రికి ఫోన్ చేయాల్సిందని, అపుడు తన తండ్రి వచ్చి దిశని క్షేమంగా ఇంటికి తీసుకెళ్లేవారని తెరాస నేత శోభ వాఖ్యానించారు.

అయితే బుధవారం నాడు మహిళల పై జరుగుతున్నటువంటి అత్యాచార ఘటనల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమం లో పాల్గొన్న శోభ మాట్లాడుతూ… ఆ నలుగురు నిందితులు తనని అడ్డుకున్నారని తన తల్లిదండ్రులకు చెప్పుకోడానికి చాలా భయపడిందని, అందుకే తన చెల్లికి ఈ విషయం చెప్పిందని అన్నారు. అంతేకాకుండా ఒక గెజిటెడ్ హోదాలో ఉన్నటువంటి దిశ కి ఆ సమయంలో ఎవరికీ ఫోన్ చేయాలో అనేది కూడా తెలియదా అని ప్రశ్నించారు. అయితే ఈ వాఖ్యలు ప్రస్తుతానికి వివాదాస్పదంగా మారుతున్నాయి. ఈ వాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.