కెసిఆర్ కోసం నా పదవిని కూడా త్యాగం చేశా… మాజీ మంత్రి సంచలన వాఖ్యలు

Tuesday, September 10th, 2019, 08:44:21 PM IST

తెలంగాణాలో పూర్తిస్థాయి మంత్రి వర్గ విస్తరణ జరిగిందో లేదో అప్పుడే తెరాస పార్టీ అసంతృప్తి గళాలు వెల్లువెత్తుతున్నాయి.. తమకి మంత్రి పదవి వస్తుందని ఎన్నో ఆశలుపెట్టుకున్నప్పటికీ కూడా చివరికి వారికి నిరాశే మిగిలిందని తెలుస్తుంది. కాగా తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. కాగా ఈ సమావేశంలో మాట్లాడిన జూపల్లి కృష్ణారావు తెరాస ప్రభుత్వం పై, ముఖ్యమంత్రి కెసిఆర్ పై కొన్ని ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. కాగా తాను ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని నిఖార్సైన మనిషినని, ఏనాడూ కూడా పదవులకోసం పాకులాడలేదని, అంతేకాకుండాపదవి రాలేదని పార్టీ మారిపోయేంత దౌర్భాగ్య స్థితి తనకు లేదని, కెసిఆర్ కోసం తన మంత్రి పదవిని కూడా త్యాగం చేశానని చెప్పుకొచ్చారు.

ఇకపోతే తానూ పార్టీ మారతానని వస్తున్నటువంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అలాంటి అసత్య వార్తలు సృష్టించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని, వారిపై పరువు నష్టం దావా వేస్తానని వెల్లడించారు. కాగా ఈ సమావేశంలో పాల్గొన్న మరొక తెరాస నేత ఎమ్మెల్యే బాజిరెడ్డి మాట్లాడుతూ… తన నాయకుడు కేసీఆరేనని, ఆయనతోనే తాను చివరి వరకు ఉంటానని తేల్చి చెప్పారు.