బీజేపీ వైఖరిని ఎండగట్టిన తెరాస ఎమ్మెల్యే బాల్క సుమన్

Wednesday, August 14th, 2019, 01:40:50 AM IST

తెరాస పార్టీ ఎమ్మెల్యే బాల్క సుమన్ భారతీయ జనతా పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణాలో బలపడాలని తీవ్రమైన ఆలోచనలు చేస్తున్నటువంటి భారతీయజనతా పార్టీ తెలంగాణాలో విద్వేషపూరితమైన కార్యకలాపాలకు పాల్పడుతుందని తెరాస ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. అంతేకాకుండా తెలంగాణలోని విద్వేష రాజకీయాలను రెచ్చగొట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం రక్తసిత్తంగా తయారు చేయడమే లక్ష్యంగా ప్రణాళికలను ఏర్పాటు చేసుకుంటుందని బాల్క సుమన్ ఆరోపిస్తున్నారు. దానికి తోడు తెలంగాణాలో అభివృద్దే లక్ష్యంగా తెలంగాణాలో దూసుకపోతున్నటువంటి తెరాస పార్టీ ని అస్థిరపరచడానికి బీజేపీ పార్టీ తీవ్రమైన కుట్రలు చేస్తుందని, కానీ ఎవరెన్ని కుట్రపూరితంగా రాజకీయాలు చేసినప్పటికీ కూడా ప్రజల్లో తెరాస పార్టీపై ఉన్నటువంటి నమ్మకాన్ని పోగొట్టలేరని బాల్క సుమన్ అన్నారు.

కాగా తెరాస ఎమ్మెల్యే బాల్క సుమన్ మంగళవారం నాడు రాష్ట్ర బీజేపీకి ఒక బహిరంగ లేఖ రాసారు. కాగా ఈ లేఖలో తెలంగాణపై బీజేపీ వైఖరిని తీవ్రస్థాయిలో బాల్క సుమన్ ఎండగట్టారు. మీకు తెలంగాణాలో అంతలా బలపడాలని ఆశగా ఉంటె, తెలంగాణాలో రక్తపుటేరులు పారించాడనికి కృషి చేస్తున్నార్నయి, కానీ రాష్ట్రాల్లోని భూముల్లో నీళ్లు పారించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తెరాస పార్టీ లక్ష్యం అని బాల్క సుమన్ అన్నారు. ఇకపోతే ఇటీవల బీజేపీ నేత లక్ష్మణ్ చేసిన వాఖ్యలపై స్పందించిన సుమన్, దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయని ఎద్దేవా చేశారు. కాగా ఇప్పటివరకు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒక్క చిల్లిగవ్వ కూడా అందించని బీజేపీ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తుందట అని విమర్శించారు.