తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్నారన్న అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాఫిక్ అయ్యింది. కేటీఆర్ సీఎం అయ్యేందుకు వచ్చే నెలలో ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్టు కథనాలు వినిపిస్తున్నాయి. అయితే కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేంటి అంటూ ఇటీవల మంత్రి ఈటల రాజేందర్ అన్నప్పటి నుంచి మెల్లగా అందరు నేతలు దీనిపై బహిరంగంగానే మాట్లాడుతున్నారు.
అయితే మాట్లాడడం పక్కనపెడితే ఏకంగా కాబోయే ముఖ్యమంత్రికి కంగ్రాట్స్ అంటూ బహిరంగ వేదికలపైనే శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నేడు సికింద్రాబాద్ రైల్వే ఎంప్లాయిస్ సంఘం కార్యాలయం ప్రారంభోత్సవంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు కేటీఆర్ పక్కనే ఉండగా కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షలు అని చెప్పడంతో తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు ఖాయమని తెలుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇంకొంచెం ముందుకెళ్లి కేటీఆర్‌కు కంగ్రాట్స్ చెబుతూ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. కంగ్రాట్స్ కేటీఆర్ అన్న అంటూ ఎమ్మెల్యే పోస్ట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Congratulations Anna@KTRTRS pic.twitter.com/49RXmsORPM
— Jeevan Reddy MLA (@jeevanreddytrs) January 21, 2021