ఆ మంత్రికి ఎలాగైనా సరే సినిమా చూపిస్తా… తెరాస ఎమ్మెల్యే శపథం

Monday, October 21st, 2019, 11:09:50 PM IST

తెలంగాణాలో అధికారంలో ఉన్నటువంటి తెరాస పార్టీ నేతల మధ్యన గత కొద్దీ రోజులుగా మాటల యుద్దాలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. కాగా ఈమేరకు తాజాగా ఒక తెరాస ఎమ్మెల్యే సాక్ష్యాత్తు తెలంగాణ మంత్రికి సినిమా చూపిస్తానని శపథం చేశారు. అయితే ఈ శపథం అనేది పగతో ప్రతీకారాలతో చేసింది కాదు. అసలు విషయం ఏంటి అంటే… తాజాగా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బిత్తిరి సత్తి హీరోగా, రసమయి ఫిలిమ్స్ పతాకంపై తుపాకీ రాముడు అనే చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రానికి టీ.ప్రభాకర్ దర్శకత్వం వహించారు. ఇటీవలే ప్రీ రిలీజ్ వేడుకను పూర్తి చేసుకున్నటువంటి తుపాకీ రాముడు చిత్రం ప్రేక్షకుల ముందుకు రాడానికి సిద్ధమైంది.

కాగా ఈ చిత్రానికి సంబందించిన ప్రీ రిలీజే వేడుకకు మంత్రులు ఈటెల రాజేందర్ మరియు హరీష్ రావు హాజరయ్యారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలు చూడటం మానేసిన మంత్రి హరీష్ రావు కి మా ఈ తుపాకీ రాముడు చిత్రాన్ని చూపిస్తానని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాటిచ్చాడు. అంతేకాకుండా తన సొంత పార్టీ నేత, ఎమ్మెల్యే నిర్మాత గా మారి నిర్మించిన ఈ చిత్రాన్ని చూస్తానని హరీష్ రావు మాట కూడా ఇచ్చారు.