తెలంగాణ లో మరో ఎమ్మెల్యే కి సోకిన కరోనా!

Thursday, July 23rd, 2020, 12:08:47 AM IST


తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. సామాన్య ప్రజల నుండి, ప్రజా ప్రతి నిధులను సైతం ఈ మహమ్మారి వదలడం లేదు. తాజా గా మరో ఎమ్మెల్యే కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అధికార పార్టీ కి చెందిన ఎమ్మెల్యే కావడం తో రాష్ట్రం లో అధికారులు అప్రమత్తం అయ్యారు. తాజాగా తెరాస పార్టీ కి చెందిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయనను అపోలో ఆసుపత్రి లో చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు తరలించారు.

అయితే ఎమ్మెల్యే కి కరోనా వైరస్ సోకడం తో ఆయనతో సన్నిహితం గా ఉన్న వారి వివరాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. తాజాగా నియోజకవర్గం లో పలు కార్యక్రమాలకు సైతం కిషన్ రెడ్డి హజరు అయినట్లు తెలుస్తోంది. అయితే ప్రజలు కూడా ఉండటం తో మరింత ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య దాదాపు 50 వేలకు చేరగా, 438 మంది కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలు కోల్పోయారు.