కరోనా బారిన పడ్డ టీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే రేఖానాయక్..!

Monday, May 3rd, 2021, 11:45:41 PM IST

తెలంగాణలో కరోనా కేసుల రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికి సెకండ్ వేవ్ ధాటికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. అయితే సామాన్యులతో పాటు ఎంతో మంది ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్ఎస్‌లో ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బారిన పడ్డారు. అయితే తాజాగా గిరిజన ప్రాంతానికి చెందిన టీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే రేఖానాయక్ కరోనా బారిన పడ్డారు.

అయితే కరోనా పాజిటివ్ అని తెలియగానే ఆమె వెంటనే హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని ఈ విషయంలో నియోజకవర్గ ప్రజలు ఆందోళనకు గురికావొద్దని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు గత వారం రోజుల నుంచి తనను కలిసిన వారిలో ఎవరికైనా లక్షణాలు ఉంటే కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని ఎమ్మెల్యే రేఖానాయక్ సూచించారు.