బాబుమోహన్ ఒక దద్దమ్మ.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు..!

Thursday, January 23rd, 2020, 03:00:54 AM IST

బీజేపీ నేత బాబుమోహన్‌పై టీఏర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే క్రాంతి కుమార్ మున్సిపల్ ఎన్నికలలో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని అన్నారు. టీఆర్ఎస్‌లో గెలిచి ఆంధోల్‌ను భ్రష్టు పట్టించిన బాబుమోహన్‌కు టీఆర్ఎస్‌ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.

అయితే బాబుమోహన్‌కు టికెట్ ఇవ్వలేదన్న కారణంగానే వెళ్ళి బీజేపీలో చేరారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి తన సొంత నిధులను ఖర్చు చేయలేని దద్దమ్మ బాబుమోహన్ అని అన్నారు. రాజకీయాలలో సినిమా డైలాగ్‌లను మానుకోవాలని బాబుమోహన్‌కు హితవు పలికారు. అయితే బాబుమోహన్‌కి నోటా కంటే తక్కువ సీట్లు వచ్చాయన్న విషయాన్ని ఎవరూ మరిచిపోలేదని, నీతిమాలిన రాజకీయానికి ప్రజలే చెక్ పెట్టారని అన్నారు.