అధికారిపై మండిపడుతున్న తెరాస ఎమ్మెల్యే – ఎందుకంటే…?

Wednesday, February 26th, 2020, 11:30:15 PM IST

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజక వర్గ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, స్థానిక మున్సిపల్ కమిషనర్ పై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే స్థానికంగా జరుపుతున్నటువంటి ప్రభుత్వ కార్యక్రమం పై తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన తెరాస ఎమ్మెల్యే రవిశంకర్, మున్సిపల్ కమిషనర్ పై తీవ్రమైన ఆగ్రహంతో ఊగిపోయారు. కాగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ రాజేంద్ర కుమార్ స్థానిక ఎమ్మెల్యే రవిశంకర్ కి ఎలాంటి సమాచారాన్ని ఇవ్వకుండానే నిర్వహించే ప్రయత్నం చేశారు. అయితే ఈ నేపథ్యంలో తనకు సమాచారాన్ని ఇవ్వని కారణంగా ఎమ్మెల్యే రవిశంకర్ బహిరంగంగానే సదరు అధికారి పై నోరు పారేసుకున్నారు.

మున్సిపల్ కమీషనర్ అనే వారు సరైన షెడ్యూల్ తయారు చేసుకోవాలని, ఒక ఎమ్మెల్యే తో తమాషాలు చేస్తున్నారా అని ఆగ్రహిస్తూనే, బహిరంగంగానే ఆ మున్సిపల్ కమిషనర్ ని యూజ్ లెస్ ఫెల్లో అని తిట్టారు. అంతేకాకుండా ఇప్పటికైనా మీ పద్దతి మార్చుకోవాలని, లేకపోతె భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాలి వస్తుందని పలు హెచ్చరికలు చేశారు.