డీఎస్ బీజేపీ వైపు చూస్తున్నారా.. షాక్‌లో కేసీఆర్.!

Friday, July 12th, 2019, 01:00:39 AM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలిచి రెండో సారి అధికారాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత వరుసగా రెండోసారి కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలిచిన, లోక్‌సభ ఎన్నికలలో మాత్రం అనుకున్న స్థానాలను గెలుచుకోలేకపోయింది.

అయితే గత కొద్ది రోజులుగా పార్టీపై, పాలనపై మరింత దృష్టి సారించిన కేసీఆర్‌కు రెండు రోజుల క్రితం పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ రాజీనామా చేసి గట్టి షాక్ ఇచ్చారు. అయితే రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్‌ కూడా పార్టీ మారుతున్నాడంటూ వార్తలు వినబడుతున్నయి. అయితే కొద్ది రోజులుగా ఈయన పార్టీ వ్యవహారాలలో దూరంగా ఉండడం బుధవారం డిల్లీలో జరిగిన తెరాస పార్లమెంటరీ పార్టీకి సమావేశానికి డీఎస్‌ హాజరుకావడం పార్టీలో కలకలం రేపింది. అయితే తాజాగా నేడు భాజపా జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీ వెనుక అసలు రహస్యం ఎంటో అని పార్టీలో గుసగుసలు వినబడుతున్నాయి. అయితే ఈ సారి జరిగిన లోక్‌సభ ఎన్నికలలో డీఎస్‌ కుమారుడు ధర్మపురి అర్వింద్‌ నిజామాబాద్‌ నుంచి కేసీఆర్‌ కుమార్తె కవితపై బీజేపీ తరుపున పోటీ చేసి విజయం సాధించారు. అయితే తన కుమారుడి విజయంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో మంచి సంబంధాలు కొనసాగిస్తే కేంద్రంలో కీలక పదవులు దక్కుతాయని అందుకే డీఎస్ కూడా బీజేపీలో చేరడానికి సుముఖంగా ఉన్నారని ఉదంతాలు వినబడుతున్నాయి. అయితే డీఎస్ మాత్రం తెరాస పార్టీనీ వీడేది లేదని ఇదివరకే స్పష్టం చేసారు.