ఆప్ విజయంపై ఆసక్తికర వ్యాఖ్యలు టీఆర్ఎస్ మాజీ ఎంపీ..!

Tuesday, February 11th, 2020, 10:50:19 PM IST

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ అద్మీ పార్టీ విజయంపై స్పందించిన టీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలలో ఆప్ 62 స్థానాలను గెలుచుకోగా, బీజేపీ 8 స్థానాలను, కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేకపోయింది. ఈ విజయంతో అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకున్నాడు.

అయితే దీనిపై స్పందించిన టీఆర్ఎస్ మీజీ మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని, ప్రజల కనీస అవసరాలను తీర్చే ప్రభుత్వం పట్ల ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తారని అన్నారు. విద్యుత్, నీరు, స్కూల్స్, ఆరోగ్యం అంశాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చినందుకు ఢిల్లీ ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీకి విజయాన్ని అందించారని, ఇలాంటి అభివృద్ధి చేసినందుకే టీఆర్ఎస్ పార్టీకి కూడా 2018 అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు బ్రహ్మ రథం పట్టారని మరోమారు గుర్తు చేశారు.