స్థానిక సంస్థల ఎన్నికలలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్..!

Monday, June 3rd, 2019, 06:15:56 PM IST

తెలంగానాలో టీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఘన విజయం సాధించింది. వరంగల్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడ్డాయి. ఈ మూడు స్థానాలకు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టారు. వరంగల్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్ది వెంకట్రామిరెడ్డిపై 827 ఓట్ల ఆధిక్యంతో, నల్గొండలో కాంగ్రెస్‌ అభ్యర్ధి లక్ష్మిపై టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి చిన్నపరెడ్డి గెలుపొందారు. రంగారెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి ఘనవిజయం సాధించారు.

అయితే నల్గొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా ఘన విజయం సాధించిన చిన్నప రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మహేందర్ రెడ్డిని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. వాళ్ల గెలుపు కోసం శ్రమించిన జిల్లా నాయకత్వానికి, స్థానిక నాయకులకు కఒడా కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇలా మూడింటికి మూడు స్థానాలను క్లీన్ స్వీప్ చేయడంతో మొన్న లోక్‌సభ ఎన్నికల్లో అనుకున్న స్థానాలు రాని టీఆర్ఎస్‌కు ఇది కాస్త ఊరటనిచ్చే అంశం అనే చెప్పాలి.