బిగ్ బ్రేకింగ్ : ఇక నుంచి మహారాష్ట్రలో ఎగరనున్న గులాబీ జెండా..కెసిఆర్ కీలక నిర్ణయం!?

Wednesday, September 18th, 2019, 02:26:56 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గత ఏడాది తన ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో అలాగే తెలంగాణ ప్రజలకున్న నమ్మకం మూలాన ముందస్తు ఎన్నికలకు వెళ్లినా సరే అఖండ విజయాన్ని సొంతం చేసుకుని ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశాన్ని కూడా ఇవ్వలేదు.అయితే ఆ ఎన్నికలో గెలిచాక మాత్రం ఇప్పుడు కాస్త భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నా కెసిఆర్ పరిపాలన విషయంలో మాత్రం ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడు అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మహారాష్ట్ర లో కూడా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.కెసిఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు తమకు అమితంగా నచ్చాయని ఆయన పరిపాలన అద్భుతంగా ఉందని చెప్పి తెలంగాణ మరియు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు తమ గ్రామాలను కూడా తెలంగాణాలో కలిపేసుకోవాలని అడుగుతున్నారట.

అంతే కాకుండా మహారాష్ట్రలో కొన్ని నియోజకవర్గాల్లో కెసిఆర్ కానీ అనుమతి ఇచ్చినట్టయతే తెరాస పార్టీ తరపున అక్కడ కూడా పోటీ చేసి గులాబీ జెండా ఎగురవేస్తామని కొంతమంది అభ్యర్థులు కూడా కెసిఆర్ కు విన్నవించుకున్నట్టు తెలుస్తుంది.దీనిపై కెసిఆర్ కూడా కాస్త సానుకూలంగానే స్పందించారని ఇంకా అధికార ప్రకటన మాత్రమే రావాల్సి ఉందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.మొత్తానికి కెసిఆర్ ఖాతాలో మరో మైలు రాయి పడిందని చెప్పొచ్చు.