టీఆర్ఎస్ తరుపున డీసీసీబీ రేసులో ఉన్న కీలక నేతలు వీరే..!

Tuesday, February 25th, 2020, 03:02:23 AM IST

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ డీసీసీబీలపై కన్నేసింది. ఈ నెల 28న డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ల ఎన్నికలు జరగనున్న కారణంగా అభ్యర్థుల నుంచి మంగవారం నామినేషన్లను స్వీకరించనున్నారు. అయితే నేడే నామినేషన్‌ల విత్‌డ్రా అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇప్పటికే దాదాపు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసుకుంది.

అయితే కరీంనగర్ జిల్లా నుంచి కొండూరు రవీందర్ రావు, మహబూబ్‌నగర్ నుంచి మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి దాదాపు ఖరారు అయ్యారు. వరంగల్ జిలా నుంచి ఎర్రబెల్లి అనుచరుడు మార్నేని రవీందర్ రావు, నిజామాబాద్‌ డీసీసీబీ రేసులో పోచారం తనయుడు భాస్కర్ రెడ్డితో పాటు మంత్రి ప్రశాంత్ రెడ్డి బంధువు రమేష్ రెడ్డి, నల్గొండ నుంచి పల్లా ప్రవీణ్ రెడ్డి, గొంగిడి సునీత భర్త మహేందర్ రెడ్డి, రంగారెడ్డి డీసీసీబీ రేసులో మనోహర్ రెడ్డి, ఆలూరు కృష్ణారెడ్డి, పెంటారెడ్డి, ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్‌ రేసులో బోజారెడ్డి, దామోదర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, మెదక్ నుంచి ఎమ్మెల్యే పద్మ భర్త దేవేందర్ రెడ్డి, పి.దేవేందర్ రెడ్డి, ఖమ్మం నుంచి పోటీలో విజయబాబు, బ్రహ్మయ్య, సుధాకర్, నాగభూషణం ఉన్నట్లు సమాచారం.