కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణుల సరికొత్త రికార్డ్..!

Saturday, July 25th, 2020, 02:24:50 AM IST


టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టిన రోజున ఆ పార్టీ శ్రేణులు సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో శుక్రవారం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమంలో దాదాపు 2 వేల మంది టీఆర్ఎస్ శ్రేణులు రక్తదానం చేశారు.

అయితే ఒకేసారి ఇంత మొత్తంలో రక్తదానం చేయడంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. గతంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో 867 మంది ఒకేసారి రక్తదానం చేయగా, ఇప్పుడు ఒకే సారి 2వేల మంది రక్తదానం చేయడంతో ఆ రికార్డు తిరగబడింది. ఇక ఈ రక్తదాన శిబిరానికి హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రులు పువ్వాడ అజయ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.