బెదిరింపులకు లొంగం – జగ్గారెడ్డి

Wednesday, September 10th, 2014, 07:57:08 PM IST


తెరాస పార్టీ బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నదని.. తాము ఎవరి బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని మెదక్ బీజేపి అభ్యర్ధి జగ్గారేడ్డి అన్నారు. తెలంగాణ కెసిఆర్, హరీష్ రావుల జాగిర్దార్ కాదని ఆయన అన్నారు. మెదక్ లో తాము తప్పకుండ గెలుస్తామని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెరాస అధికారంలోకి వచ్చాక…రైతుల, ప్రజాసమస్యలు పట్టించుకోవడం మానేసి.. అభాండాలువేసే పనిలోనే నిమగ్నమైపోయిందని జగ్గారెడ్డి ఆరోపించారు. తాను మెదక్ ఉప ఎన్నికలో గెలిచాక.. తెరాస నేతలను బంతాట ఆడుకుంటానని జగ్గారెడ్డి అన్నారు. నర్సాపూర్ సభలో కెసిఆర్ ఇతర పార్టీలను బెదిరించేవిధంగా మాట్లాడారని జగ్గారెడ్డి విమర్శించారు.