న‌యీమ్ నెపంతో కేసీఆర్ ఆడుతున్న పొలిటిక‌ల్ గేమ్‌!!

Saturday, September 17th, 2016, 01:22:23 PM IST

nayeem
గ్యాంగ్ స్ట‌ర్ న‌యీమ్ మ‌ర్డ‌ర్ తో తెలుగు రాష్ట్రాల రాజ‌కీయ నేత‌ల్లో గుబులు మొద‌లైంది. ముఖ్యంగా తెలంగాణ నాయ‌కుల‌లో కొంద‌రికి న‌యీమ్ మ‌ర్డ‌ర్ అనంత‌రం కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఇప్ప‌టికే సిట్ ముందు కొంత మంది జాత‌కాల చిట్టా ఉంది. సిట్ మీడియా ముందుకు వ‌స్తే వాళ్ల హిస్ట‌రీ చిరిగిపోవ‌డం ఖాయం. ఇటు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సోంత మీడియా న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక‌, టీ-న్యూస్ లో న‌యీమ్ డైరీలో ఉన్న వాళ్లు అంద‌రికీ శిక్ష‌లు త‌ప్ప‌వ‌ని సంకేతాలు జారీచేస్తు క‌థ‌నాలు రాస్తోంది. దీంతో వామ‌ప‌క్షాల నేత‌లు కేసీఆర్ ప‌త్రిక‌పై నిప్పులు చెరిగారు.

మీ ద‌గ్గ‌ర నిజ‌మైన ఆధారాలుంటే ధైర్యంగా పేర్లు ప్ర‌చురించండి అంటూ కోమ‌ట‌రెడ్డి వెంక‌ట రెడ్డి ఆ ప‌త్రిక‌కు స‌వాల్ విసిరారు. టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి సిట్ వ‌ద్ద ఆధారాలుంటే త‌క్ష‌ణం మీడియా ముందు ప్ర‌వేశ పెట్టాల‌ని డిమాండ్ చేశారు. అర్ధం ప‌ర్ధం లేని రాత‌లతో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెట్టొద్ద‌ని న‌మ‌స్తే తెలంగాణ‌కు వార్నింగ్ ఇచ్చారు. ఇదంతా కేసీఆర్ ఆడుతోన్న పొలిటిక‌ల్‌ గేమ్ అని మండిప‌డ్డారు. అటు ఎల్బీ న‌గ‌ర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణ‌య్య కూడా త‌న‌పై ప్ర‌భుత్వం బుర‌ద చ‌ల్లుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. న‌యీమ్ తో నాకు సంబంధాలున్నాయి..కానీ అవి ఆర్ధిక‌ప‌ర‌మైన‌వి కావ‌ని మ‌రోసారి మీడియా ముందు స్ప‌ష్టం చేశారు.