స్థానిక ఎన్నికల పోరులో కారు జోరు మరింత పెరిగిందిగా..!

Wednesday, June 5th, 2019, 12:21:18 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలిచి రెండో సారి అధికారాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించగా, కేసీఆర్ తనయుడు కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తరువాత వచ్చిన లోక్‌సభ ఎన్నికలకు సిద్దమైన టీఆర్ఎస్ పార్టీకీ కాస్త చేదు అనుభవమే మిగిలిందని చెప్పుకోవాలి.

ఎందుకంటే తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ 17 లోక్‌సభ స్థానాలకు గాను 16 స్థానాలను గెలుచుకోబుతున్నామని ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చింది. అయితే వీరి అంచనాలు మాత్రం కాస్త తలకిందులయ్యాయి. 17 స్థానాలకు కాను టీఆర్ఎస్ కేవలం 9 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. అయితే బీజేపీ 4 స్థానాలను, కాంగ్రెస్ 3 స్థానాలను గెలుచుకోగా, ఎంఐఎం ఒక్క స్థానాన్ని గెలుచుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలలో ఘోరంగా విఫలమై కేవలం ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకున్న బీజేపీ అనూహ్యంగా పుంజుకుని ఏకంగా 4 ఎంపీ స్థానాలను గెలుచుకోవడమే కాకుండా సీఎం కేసీఆర్ కూతురు కవితను కూడా ఓటమిపాలు చేసింది. అయితే లోక్‌సభ ఎన్నికలలో ఇలాంటి పరిస్థితులు ఎదురుకున్న టీఆర్ఎస్ పార్టీకీ గత నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో కాస్త ఊరట లభించింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు నిన్న విడుదలయ్యాయి. అయితే ఈ ఫలితాలలో మాత్రం టీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీని అందించారు తెలంగాణ ప్రజలు. అయితే ఇదంతా బట్టి చూస్తుంటే స్థానికంగా లోకల్ పార్టీ కావడం, ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ అనే కారణాలతో ప్రజలు మళ్ళీ టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారు. ఏది ఏమైనా స్థానిక ఎన్నికలలో స్పష్టమైన మెజారిటీని సాధించుకుని స్థానికంగా టీఆర్ఎస్ పార్టీ మరోసారి తన సత్తాను నిరూపించుకుందనే చెప్పాలి.