మళ్ళీ వాయిదా

Tuesday, October 14th, 2014, 01:29:55 PM IST

trs-car
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిష్టాత్మకంగా జరపతలపెట్టిన ప్లీనరీ సమావేశం మరోసారి వాయిదా పడింది. ఈనెల 11, 12వ తేదీలలో హైదరాబాద్ నగరంలోని ఎల్బి స్టేడియంలో ప్లీనరీ సమావేశాలు నివహించాలని పార్టీ భావించింది. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు కూడా చేసింది. అయితే, వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో.. ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని.. ఈ సమావేశాలను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. 18న ఎల్బీ స్టేడియంలో ప్లీనరీ సమావేశం…19న సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని తెరాస నిర్ణయించింది. అయితే, తెరాస మరోసారి.. ప్లీనరీ సమావేశాన్ని వాయిదా వేసింది. దీపావళి తరువాత ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు తెరాస పేర్కొన్నది.