కెసిఆర్ మాటతప్పారు అంటున్న సీనియర్ నేత.. ఇంతకీ ఎవరతను…?

Monday, September 9th, 2019, 11:26:36 PM IST

తెలంగాణ లో జరిగినటువంటి ఎన్నికల్లో అఖండమైన మెజారిటీతో తెలంగాణాలో వరుసగా రెండవసారి అధికారాన్ని దక్కించుకున్నటువంటి తెరాస పార్టీ కి ఇక తెలంగాణాలో ఎదురే లేదని మరొకసారి రుజువు చేసుకుంది. కాగా రెండవసారి అదికారంలోకి వచ్చాక మొదటిసారిగా జరిపినటువంటి తెలంగాణ మంత్రి వర్గ విస్తారణ ద్వారా కొందరికే మంత్రి పదవులు ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. కాగా ఇటీవల రెండవసారి జరిపిన మంత్రి వర్గ విస్తరణ జరిపిన కెసిఆర్ రెండవసారి మరొక 6 మందికి కొత్తగా మంత్రులుగా అవకాశం కల్పించారని అందరికి తెలుసు. కాగా ముందుగా అనుకున్న ప్రకారం మాజీ మంత్రులైన హరీష్ రావు మరియు కేటీఆర్ లకు మరొకసారి తెలంగాణ క్యాబినెట్ లో మంత్రులుగా అవకాశం లభించడంతో వారు పార్టీ తరపున, పార్టీ అధినాయకత్వం తరపున ఎన్నటికీ ఋణపడి ఉంటామనిచెబుతున్నారు.

కానీ తెలంగాణ మంత్రి వర్గ విస్తరణలో మంత్రం తనకి చాలా అన్యాయం జరిగిందని తెరాస పార్టీ సీనియర్ నేత నాయిని నరసింహారెడ్డి వాపోతున్నారు. కాగా గత తెలంగాణ ప్రభుత్వ హయాంలో హోంమంత్రి గా బాధ్యతలను నిర్వర్తించిన నాయిని, కనీసం ఈసారి ఎన్నికల్లోకూడా పోటీ చేయలేదు. దానికి కారణం కెసిఆర్ అని బహిరంగంగానే చెప్పారు. కాగా తనకి మంత్రి పదవి ఇస్తానని, తన అల్లుడికి ఎమ్మెల్సీ పదవికట్టబెడతానని కెసిఆర్ ఎన్నికలకు ముందే హామీ ఇచ్చారని, కానీ ఇపుడు కెసిఆర్ మాట తప్పి తనని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నాయిని నరసింహ రెడ్డి.. ఇక తనకి పార్టీ తరపున ప్రాధాన్యం తగ్గిపోయిందని, అందుకనే తనకి ఎలాంటి మంత్రి పదవి రాలేదని నాయిని తీవ్ర అసంతృప్తిలో ఉన్నరినై సమాచారం.