75 వేలమంది ఎన్నారై లకు పొగ..హెచ్1బి వీసా ట్రబుల్స్..!

Wednesday, January 3rd, 2018, 02:50:18 AM IST

ట్రంప్ అధికారంలోకి వచ్చాక యూఎస్ లో ఉంటుంన్న ఎన్నారై లు బిక్కుబిక్కు మంటున్నారు. ఎప్పుడు ఎలాంటి కొత్త రూల్స్ తో ఇబ్బంది పెడతారో అని వారి భయం. కాగా మరో మారు హెచ్ 1 బి వీసా వ్యవహారం తెరపైకి వచ్చి 75 వేలమంది ఎన్నారై లని పెడుతోంది. ఇకపై నుంచి హెచ్ 1 బి వీసాలని పొడిగించుకునేందుకు వీలులేకుండా నిబంధలు తీసుకురావాలనేది అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఆలోచన ఆ దిశగా అడుగులు పడుతున్నాయి.

యుఎస్ లో ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటున్నవారు సొంత నివాసం ఏర్పరుచుకునేందుకు గ్రీన్ కార్డుకు అప్లై చేస్తారు. గ్రీన్ కార్డు రావడం ఆలస్యం అయితే హెచ్ 1 బి వీసాలని పొడిగించుకుంటారు. ఇకపై అలాంటి వీలు లేకుండా చేయాలని చూస్తున్నారు. ఇది అమలైతే వేలాది మంది ఇండియన్ లు తిరుగు ముఖం పట్టక తప్పదని అంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments