ట్రంప్ వల్ల ప్రపంచం సర్వ నాశనం

Friday, January 27th, 2017, 12:32:48 PM IST

trump
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ ప్రపంచానికే వినాశనం చేస్తాడు అంటున్నారు సైంటిస్ట్ లు .. ముందే ప్రపంచ వినాశనం ఊహించి జరగాల్సింది ఊహించి అటామిక్ సైంటిస్ట్ లు బులెటిన్ దూమ్స్ డే గడియారం మరొక ముప్పై సెకన్ లు తగ్గించారు. ప్రపంచ నాశన సమయం ఈ గడియారం చూపిస్తుంది అని అందరికీ తెలిసిందే. తమ సింబాలిక్ డూమ్స్ డే గడియారం అర్థరాత్రికి రెండున్నర నిమిషాల ముందుకు మార్చారు. 1953లో అణు యుద్ధం జరిగిన సమయంలో ఉన్న డూమ్స్ డే సమయంతో పోలిస్తే, ఇది అతి దగ్గరి సమయం. ప్ర‌పంచ వ్యాప్తంగా మానవత్వం నశిస్తుండటం, పెరిగిపోతున్న అణ్వాయుధాలు, వాతావ‌ర‌ణ మార్పుల‌ు, ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన చేసిన వ్యాఖ్యలతో ప్ర‌పంచ వినాశ‌నం మరింత త్వరగా సంభవిస్తుందన్న ఆందోళన పెరిగిందని, 15 మంది నోబెల్ బ‌హుమ‌తి గ్ర‌హీత‌లు ఉన్న అటామిక్ శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది.