మన శ్రేయోభిలాషి ఎవరు ?.. ట్రంపా..హిల్లరీనా..?

Thursday, September 29th, 2016, 01:32:52 PM IST

trump-cinnari
శ్వేత సౌధాన్ని ఏలేది ట్రంపా లేక హిల్లరీనా అనే విషయం కొన్ని రోజుల్లో తేలనుంది. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల నగారా మోగింది.తుది అభ్యర్థులు హిల్లరీ క్లింటన్, డోనాల్డ్ ట్రంప్ ల మధ్య పోటాపోటీ పోరు జరుగుతోంది.విజేతగా ఎవరు నిలుస్తారనేదానిపై ఉత్కంఠ నెలకొని ఉంది.ఈ నేపథ్యం లో వీరిరువురిలో ఎవరు గెలిస్తే భారత్ కు ఉపయోగం? ఎవరు ఇండియా తో ఫ్రెండ్లీ గా ఉంటారు ? అనే చర్చ నడుస్తోంది.

ముఖ్యంగా అమెరికా, భారత్ రెండు దేశాల పై ఉగ్రవాదుల కన్ను ఉన్న మాట వాస్తవమే. ఈ నేపథ్యం లో ఉగ్రవాద నిర్మూలనకు రెండు దేశాలు కలసి అడుగు వేయాలి. హిల్లరీ క్లింటన్ గతం లోనే భారత రాజకీయ నేతలతో ఆమెకు పరిచయం ఉంది. భారత ప్రజలు కూడా హిల్లరినే గెలవాలని కోరుకుంటున్నారు.కానీ హిల్లరీ క్లింటన్ ఉగ్రవాదం పై అంత కఠినంగా వ్యవహరిస్తారా అనే సందేహం ఉంది. ఉగ్రవాదనాన్ని పెంచి పోషిస్తున్న దేశం పాకిస్థాన్ అనడం లో ఎలాంటి సందేహం లేదు.పాక్, చైనా లు రెండు దేశాలు పక్కనే ఉంటూ చీడ పురుగుల్లా తయారయ్యాయి. చైనా మద్దత్తు పాక్ కే అనే వాదన వినిపిస్తోంది.అలాంటి దేశాలకు బుద్ధి చెప్పాలంటే అమెరికా వంటి అగ్రరాజ్యం సపోర్ట్ అవసరం అనేది విశ్లేషకుల వాదన.ట్రంప్ ఐతే తనొస్తే ఉగ్రవాద దేశాలకు ఊచకోతే అనే సందేశాన్ని పంపాడు.భారత్ పై ట్రంప్ కు ప్రత్యేక మైన కోపం ఏమిలేదు. తన దేశ పౌరుల ఉద్యోగావకాశాలను కొల్లగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసాడు. ఈ నేపథ్యం లో ట్రంప్ గెలిస్తే తనని భారత్ కు అనుకూలంగా మలుచుకోగల రాజకీయ చతురతని మోడీ ప్రదర్శించాల్సి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.