తెలుగువాడి హత్య గురించి స్పందించిన ట్రంప్

Tuesday, February 28th, 2017, 01:32:22 PM IST


కన్సాస్ బార్ లో హత్యకి గురి అయిన తెలుగు వ్యక్తి కూచిభొట్ల శ్రీనివాస్ ఉదంతం ఇప్పడు డోనాల్డ్ ట్రంప్ వరకూ వెళ్ళింది. మొన్నటి వరకూ ఆయన ఈ విషయం మీద స్పందించడం లేదు అని అందరూ సీరియస్ ఐన తరుణం లో ఇప్పటికి ఆయన దగ్గర నుంచి రిప్లయ్ వచ్చింది. కన్సాస్ నుంచి వస్తున్న వార్తలు ట్రంప్ ని కలచివేసాయి అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ పేర్కొన్నారు. బుధవారం జరిగిన కాల్పుల్లో శ్రీనివాస్ మరణించగా, ఆయన స్నేహితుడు అలోక్, మరో అమెరికన్ తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనను జాతి విద్వేష పూరిత చర్యగా అభివర్ణించడం తగదని, ఇటువంటి చర్యలను ఎవ్వరూ సమర్థించబోరని ట్రంప్ వ్యాఖ్యానించినట్టు స్పైసర్ పేర్కొన్నారు. కాగా, భారత విదేశాంగ శాఖ కార్యదర్శి జై శంకర్, తన నాలుగు రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు చేరుకుని, హెచ్-1బీ వీసాల విషయంతో పాటు, ఇండియన్స్ పై దాడుల గురించి యూఎస్ అధికారులతో చర్చించనున్న నేపథ్యంలో వైట్ హౌస్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.