పాకిస్తాన్ మీద టార్గెట్ పెట్టిన ట్రంప్

Thursday, February 9th, 2017, 02:00:24 AM IST


ఉగ్రవాదులనీ ఉగ్రవాదులకి మద్దతు ఇచ్చే వారినీ ఒకే రకంగా ట్రీట్ చేస్తూ నామ రూపాలు లేకుండా చేస్తా అంటూ ప్రతిజ్ఞ చేసారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. పాకిస్తాన్ మీద ప్రైమరీ టార్గెట్ పెట్టిన ఆయన జైషే మహమ్మద్ చీఫ్, పఠాన్ కోట్ ఉగ్రదాడి సూత్రధారి మసూద్ అజర్ ను చైనాలోకి రానివ్వకుండా నిషేధించాలని ఆయన కోరినట్టు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. తమ దేశాధ్యక్షుడు మసూద్ నిషేధంపై చైనా ముందు ప్రతిపాదనలు ఉంచారని, చైనా ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూస్తున్నామని యూఎస్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. మసూద్ అజర్ మీద బ్రిటన్, ఫ్రాన్స్ సపోర్ట్ సాధించిన భరత్ యూఎస్ మద్దతు కూడా సాధించినట్టు అయ్యింది. నిజానికి అమెరికా సాంక్షన్ కమిటీ ఏదైనా ప్రతిపాదన పెడితే దాని మీద దాదాపు తొమ్మిది నెలల తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ఆ తరువాత అది రద్దు కావడమో లేదా బ్లాక్ కావడమో జరుగుతుంది. యూఎస్ ప్రతిపాదన ప్రపంచ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి రెండిట్లో ఏది జరిగినా చైనాకది ఎదురుదెబ్బేనని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.