మోడీకి షాక్ ఇచ్చిన ట్రంప్ !

Sunday, June 2nd, 2019, 05:28:23 PM IST

మోడీ రెండోసారి ప్రధానిగా ప్రమాణాస్వీకారం చేశారో లేదో అంతలోపే అగ్రరాజ్యం అమెరికా నుండి ఆయనకు షాక్ తగిలింది. వాణిజ్య రంగంలో భారత్‌కు ఇస్తున్న పన్ను రాయితీని ఎత్తివేస్తూ ఆయన ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో భారత ఆర్ధిక వ్యవస్థకు నష్టం కలగనుంది. సుమారు 39,000 కోట్ల ఎగుమతులపై భారత్‌కు పన్ను రాయితీ లభించదు. జిఎస్పీ ద్వారా 1976 నుండి భారత్ ఈ పన్ను రాయితీ లబ్దిని పొందుతూ వస్తోంది. కానీ ట్రంప్ ఒక్కసారిగా దాన్ని రద్దు చేయడంతో భారత్ ఇకపై ఆ సౌలభ్యాన్ని కోల్పోనుంది.

ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రధాన కారణం భారత్‌లో అమ్రికా వస్తువులకు తగిన మార్కెట్ సైకార్యాన్ని కల్పించడంలో భారత్ విఫలమవడమే. ఒప్పందంలో భాగంగా అమెరికా ఉత్పత్తులకు ఇండియాలో సరైన మార్కెటింగ్ సౌలభ్యం కల్పించాలి. కానీ భారత్ అందులో విఫలమైంది, దీనిపై ఇంతకుముందే నోటీసులు ఇచ్చినా సరిగా స్పందించలేదట మనవాళ్ళు. దీంతో పన్ను రాయితీ కాస్త రద్దైంది. దీంతో ఇంతకుముందు ఎలాంటి పన్ను లేకుండా ఎగుమతి అవుతున్న సుమారు 1900 ఉత్పత్తులకు ఇకపై పన్ని చెల్లించాల్సి ఉంటుంది.