ప్రార్ధనా మందిరాలకి ఇబ్బంది కలిగించడం ప్రభుత్వ ఉద్దేశ్యం కాదు – కేసీఆర్

Saturday, July 11th, 2020, 02:28:25 AM IST


తెలంగాణ రాష్ట్రం లో సచివాలయం కూల్చి వేత పై ప్రతి పక్ష పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. అయితే తాజాగా సచివాలయం కూల్చివేత లో ఆలయం మరియు మసీద్ లకు ఇబ్బంది కలిగిన విషయం తెలిసిందే. దీని పై సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. సచివాలయం స్థలం లో ప్రభుత్వ ఖర్చు తో ఎక్కువ విస్తీర్ణం లో ఆలయం, మసీద్ లను నిర్మిస్తాం అని హామీ ఇచ్చారు. భావనలను కూల్చే క్రమం లో శిథిలాలు పడి వాటికి నష్టం జరిగింది అని, వాటిని ప్రజలు అర్దం చేసుకోవాలి అని అన్నారు.

అయితే ప్రార్థన మందిరాలను ఇబ్బంది కలిగించడం ప్రభుత్వ ఉద్దేశ్యం కాదని స్పష్టం చేశారు.ఎన్ని కోట్లు అయినా వెనకాడకుండా ఆలయం, మసీద్ లను నిర్మిస్తాం అని అన్నారు. అయితే వాటిని పూర్తి స్థాయిలో నిర్మించి సంబంధిత వ్యక్తులకు అప్పగిస్తామని వ్యాఖ్యానించారు.అంతేకాక తెలంగాణ సెక్యులర్ రాష్ట్రం అని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లౌకిక స్పూర్తి ను కొనసాగిస్తామని అన్నారు. అయితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కి చెందిన నేతలు సీఎం కేసీఆర్ తీరు పై మండిపడుతున్నారు.