వాక్సినేషన్ ద్వారానే కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కోగలం – మంత్రి ఈటెల

Thursday, April 1st, 2021, 05:16:35 PM IST

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ లో ఈ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సైతం పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే ఈ మేరకు నేటి నుండి తెలుగు రాష్ట్రాల్లో 45 ఏళ్లు పైబడిన వారందరికీ కూడా వాక్సిన్ వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే ఈ నేపథ్యం లో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అయితే తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ వైద్య కళాశాలలు, టీవీవీపీ ఆసుపత్రుల్లో నే టీకాలు వేశామని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. అయితే నేటి నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా వాక్సినేషన్ చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. అయితే కరోనా వైరస్ వాక్సినేషన్ పై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే 45 ఏళ్ల పై బడిన వారందరికీ కూడా వాక్సిన్ అందుబాటులో ఉంటుంది అని,అంతా కూడా విధిగా టీకా వేయించుకోవాలి అని వ్యాఖ్యానించారు. అయితే కరోనా వైరస్ వాక్సినేషన్ ద్వారానే కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కోగలం అని వ్యాఖ్యానించారు. అయితే అందరూ కూడా కరోనా వైరస్ నిబంధనలను పాటించాలి అని మంత్రి సూచించారు.