బిగ్ న్యూస్: ఆకాశం మీద పడినా ఎన్నికలు జరగాల్సిందేనా – తెలంగాణ హైకోర్ట్

Thursday, April 29th, 2021, 12:52:58 PM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉన్నా, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్పొరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడం పట్ల తెలంగాణ రాష్ట్ర హైకోర్ట్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే రేపటి తో తెలంగాణ లో రాత్రి పూట కర్ఫ్యూ ముగియనుంది అని, అయితే తర్వాత తమ నిర్ణయం ఏమిటి అంటూ రాష్ట్ర ప్రభుత్వం ను హైకోర్ట్ సూటిగా ప్రశ్నించింది. దీని పై పరిస్థతి ను సమీక్షించి రేపు నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. అయితే నియంత్రణ చర్యల పై దాగుడు మూతలు ఎందుకు అంటూ సూటిగా ప్రశ్నించింది. కనీసం ఒక రోజు ముందు చెబితే నష్టం ఏమిటి అంటూ నిలదీసింది. అయితే కట్టడి చర్యల పై ఎలాంటి సూచనలు ఇవ్వడం లేదు అని, క్షేత్ర స్థాయి పరిస్థితులు చూసి నిర్ణయం తీసుకోండి అంటూ అంటూ సూచించింది. అయితే దీని పై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం నేడు ఇవ్వనుంది. అయితే ఎన్నికల నిర్వహణ పై సైతం హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

కరోనా వైరస్ క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికలకు ఎందుకు వెళ్ళారు అని, ప్రజల ప్రాణాలు విలువైనవా లేక ఎన్నికలా అంటూ వరుస ప్రశ్నలు గుప్పించింది. యుద్ధం వచ్చినా, ఆకాశం మీద పడినా ఎన్నికలు జరగాల్సిందేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు క్షేత్ర స్థాయి పరిస్థితులను గమనిస్తున్నారా అంటూ సూటిగా ప్రశ్నించింది. అధికారులు భూమి పై నివసిస్తున్నారా లేక ఆకాశం లోనా అంటూ విమర్శలు చేయడం జరిగింది. అయితే కొన్ని మునిసిపాలిటి లకు ఇంకా సమయం ఉందని ఎన్నికల కమిషన్ తెలిపింది. అయితే ప్రభుత్వం నిర్ణయంతో ఎన్నికలని నిర్వహిస్తున్న విషయాన్ని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. నోటిఫికేషన్ ఇవ్వడం పట్ల హైకోర్ట్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అంతేకాక ఎన్నికలను వాయిదా వేసే అధికారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి లేదా అంటూ సూటిగా ప్రశ్నించింది. అయితే ప్రచార సమయం కూడా కుదించలేదు అని,అధికారులు విచారణకు హాజరు కావాలి అంటూ హైకోర్ట్ ఆదేశాలను జారీ చేసింది. అయితే దీని పై రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.