డబ్లూహెచ్ ఓ, ఐసీఎంఆర్ లకు కూడా కరోనా ప్రభావం ఎలా ఉంటుందో తెలియలేదు!

Sunday, July 26th, 2020, 07:44:31 PM IST

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలను కోల్పోయారు. అయితే భారత్ లో సైతం కరోనా భారీగా ప్రాణాలను బలి తీసుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా తన ప్రతాపాన్ని కొనసాగిస్తోంది. అయితే కరోనా వైరస్ ను కట్టడి చేయడం లో కీలక పాత్ర పోషిస్తున్న వైద్య, పారిశుధ్య శాఖ ల పై తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

కరోనా వైరస్ మహమ్మారి రాకతో ప్రపంచం అంతా అప్రమత్తం అయింది అని, డబ్ల్యు హెచ్ ఓ,ఐసిఎంఆర్ లు సైతం కరోనా ప్రభావం ఎలా ఉంటుంది అనేది చెప్పలేక పోయింది అని, కాకపోతే వారు ఇచ్చిన సలహాలను పాటించాం అని మంత్రి అన్నారు. అంతేకాక 81 శాతం మందికి కరోనా సోకినట్లు కూడా తెలీదు అని అన్నారు. ఈ వైరస్ సోకిన వారికి చికిత్స కి ఖర్చు వెయ్యి కూడా మించదు అని, కాకపోతే తీవ్రత ఎక్కువ అయి ఆసుపత్రి కి వెళ్ళినప్పుడు ఖర్చు ఎక్కువ అవుతుంది అని అన్నారు.

లక్షణాలు లేని వారి ద్వారా కరోనా ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని, అంతేకాక రాపిడ్ టెస్ట్ ల విషయం లో ఆలస్యం అయింది అని, కరోనా సోకి ఇసోలేశన్ లో ఉంటున్న వారి వివరాలను, ఇంట్లో వారి వివరాలను సైతం సేకరించాలి అని అధికారులకు ఆదేశాలను జారీ చేసారు. అయితే కరోనా సోకి మరణించిన వ్యక్తి ను ఇంట్లో వాళ్ళు కూడా ముట్టుకొనే పరిస్తితి లేదు అని, అయితే వైద్యులు, మునిసిపల్ సిబ్బంది అంత్యక్రియలు చేస్తున్నారు అని ఈ నేపధ్యంలో లో తెలిపారు. వారిని అభినందించాలి కానీ హేళన చేయకూడదు అంటూ ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు.