బిగ్ న్యూస్: నాలాంటి సాధారణ వ్యక్తి పై కేసీఆర్ తన శక్తినంతా ఉపయోగిస్తున్నారు – మంత్రి ఈటెల

Monday, May 3rd, 2021, 12:44:32 PM IST


తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పై వస్తున్న ప్రచారం పట్ల సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ వ్యవహారం పై మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. యావత్ తెలంగాణ అసహ్యించుకునే విధంగా తన పై దుష్ప్రచారం చేశారు అంటూ మంత్రి ఈటెల ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి మచ్చ తెచ్చే పని ఎప్పుడూ చేయలేదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే మంత్రిగా కూడా కేసీఆర్ అవకాశం ఇచ్చారు అని వ్యాఖ్యానించారు.

పార్టీకి, ప్రభుత్వానికి, కేసీఆర్ కి మచ్చ తెచ్చే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు అని అన్నారు. అయితే తెలంగాణ ఉద్యమ సమయం లో అసెంబ్లీ లో పోరాడే అవకాశం కల్పించారు అని గుర్తు చేసుకున్నారు. అయితే కేసీఆర్ ఉద్యమ నాయకుడు గా ఏనాడూ కూడా అధర్మం వైపు వెళ్ళలేదు అని వ్యాఖ్యానించారు. అంతేకాక కేసీఆర్ ఏనాడూ కూడా ఉద్యమ నాయకుడు గా అనిచివేత కి భయపడ లేదు అని తెలిపారు. అయితే కేసీఆర్ తెలంగాణ ప్రజలను, ధర్మాన్ని నమ్ముకున్నారు కానీ, డబ్బులను నమ్ముకొలేదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే అలాంటి కేసీఆర్ నాలాంటి సాధారణ వ్యక్తి పై తన శక్తినంతా ఉపయోగిస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా పై అన్ని శాఖలను ఉపయోగిస్తున్నారు అంటూ అవేదన వ్యక్తం చేశారు. అయితే నర్సాపూర్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ను పిలిపించుకొని చర్చోపచర్చలు జరిపారు అంటూ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. అయితే మంత్రి చేసిన వ్యాఖ్యల పట్ల తెరాస నేతలు, కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.