రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల కొరత లేదు – మంత్రి ఈటెల రాజేందర్

Thursday, April 22nd, 2021, 01:00:27 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి ను కట్టడి చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ వంద శాతం పని చేస్తోంది అంటూ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. అయితే ఈ మహమ్మారి పర్యవేక్షణ కొరకు ఒక ఐఏఎస్ అధికారిని ప్రత్యేకంగా నియమించినట్లు మంత్రి తెలిపారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడా కూడా రెం డెసివిర్ ఇంజెక్షన్ల కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు. అంతేకాక తెలంగాణ రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రదేశాల నుండి ఆక్సిజన్ సరఫరా చేయాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ ను కోరినట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం లో ఆక్సిజన్ కొరత ఎక్కడా రాకుండా సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అని మంత్రి తెలిపారు.

అయితే కరీం నగర్ లోని తుమ్మనపల్లి లో వరిదాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఈటెల రాజేందర్ మీడియా ద్వారా మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కూడా వాక్సిన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే పల్లెలకు కరోనా వైరస్ వ్యాప్తి చెందితే చాలా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి అని వ్యాఖ్యానించారు. స్వీయ నియంత్రణ పద్ధతులు పాటించాలి అని సూచించారు. అంతేకాక రాత్రి పూట కర్ఫ్యూ విధించడం వలన కొన్ని కేసులు తగ్గుముఖం పడతాయి అంటూ చెప్పుకొచ్చారు.