తెలంగాణ లో ఆక్సిజన్ కొరత వాస్తవమే – ఈటెల రాజేందర్

Friday, April 16th, 2021, 03:36:13 PM IST

Etela-Rajender

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత తెలంగాణ రాష్ట్రం లో కొనసాగుతూనే ఉంది. అయితే కరోనా వైరస్ మహమ్మారి ఉదృతి ఎక్కువగా ఉన్న నేపథ్యం లో ప్రజలు మరింత అప్రమత్తం గా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం లో ఆక్సిజన్ కొరత ఉన్న విషయం వాస్తవమే అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆక్సిజన్ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వ్యాఖ్యానించారు. అయితే 25 ఏళ్లు పైబడిన వారికి టీకా ఇవ్వాలని మంత్రి హర్ష వర్ధన్ ను కోరినట్లు ఈటెల రాజేందర్ అన్నారు. అయితే వాక్సిన్ అభ్యర్థన పై సానుకూలం గా స్పందించారు అని, కాకపోతే హామీ మాత్రం ఇవ్వలేదు అని అన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం లో లాక్ డౌన్, కర్ఫ్యూ విధించే ఆస్కారం లేదు అని, కాకపోతే ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటికి రావొద్దు అని అన్నారు.