ప్రధాని మోడీ కరోనా కట్టడి లో ఫెయిల్ అయ్యారని అనుకోవాలా? – కేటీఆర్!

Tuesday, July 14th, 2020, 02:50:19 AM IST


తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. అయితే కరోనా వైరస్ మహమ్మారి ను అరికట్టడం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయింది అంటూ బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్న తరుణంలో మంత్రి కేటీఆర్ గట్టి సమాధానం ఇచ్చారు. కరోనా వైరస్ ఇపుడపుడే వడిలిపోయే పరిస్తితి లేదు అని అన్నారు. జాగ్రత్తలతో పాటుగా కలిసి సహజీవనం చేయాల్సిన పరిస్తితి ఉంది అని, అయితే కరోనా వైరస్ కట్టడి లో కేసీఆర్ విఫలం అయ్యారు అనే విమర్శలు అర్ద రహితం అని అన్నారు. కరోనా విషయం లో ప్రపంచం లోనే భారత్ మూడో స్థానం లో ఉంది అని, అలాంటపుడు ప్రధాని మోడీ కరోనా కట్టడి లో విఫలం అయ్యారని అనుకోవాలా అంటూ దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు.

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విమర్శలు సరికావు అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ నేపధ్యంలో మంత్రి ఈటెల రాజేందర్ చాలా అద్భుతంగా పని చేస్తున్నారు అని ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాక ప్రైవేట్ ఆసుపత్రుల కంటే కూడా ప్రభుత్వ ఆసుపత్రు లే అద్బుతం పని చేస్తున్నాయి అని అన్నారు.