సీఎం కేసీఆర్ పనితీరుకు నిదర్శనమే సాగర్ ఉపఎన్నిక ఫలితం – మంత్రి తలసాని శ్రీనివాస్

Monday, May 3rd, 2021, 12:00:31 AM IST

తెలంగాణ రాష్ట్రం లో నాగార్జున సాగర్ ఉపఎన్నిక ఫలితం వెలువడింది. అయితే ఈ ఉపఎన్నిక కౌంటింగ్ నేడు జరగగా, అందులో అధికార పార్టీ కి చెందిన అభ్యర్ధి నోముల భగత్ భారీ మెజారిటీ తో ఈ ఎన్నికలో విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికలో గెలుపొందిన అనంతరం తెరాస శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరుకు నిదర్శనమే సాగర్ ఉపఎన్నిక ఫలితం అంటూ చెప్పుకొచ్చారు. అయితే విపక్షాలు చేసిన ఆరోపణలను ప్రజలు నమ్మలేదు అంటూ చెప్పుకొచ్చారు. ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే మినీ పురపోరు లోనూ ఇదే తరహా ఫలితాలే వస్తాయి అంటూ ధీమా వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి గెలిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారు అని ఆ పార్టీ ప్రచారం చేసినా, ఆయన్ను ప్రజలు ఇంటికే పంపించారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకనైనా బీజేపీ నేతలు ఆచితూచి మాట్లాడాలి అంటూ సలహా ఇచ్చారు. అయితే ప్రతిపక్షాలు తెరాస నేతల పై వ్యక్తిగత దూషణలు మానికోవాలి అంటూ హితవు పలికారు. అయితే ఈ ఎన్నికలో తెరాస అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసిన తెరాస నేతలకు, కార్యకర్తలకు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.