తెలంగాణ లో లాక్ డౌన్ అంటూ నకిలీ ఉత్తర్వులు

Monday, April 5th, 2021, 02:36:49 PM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసుల ప్రతి రోజూ కూడా వెయ్యి కి పైగా నమోదు అవుతున్నాయి. అయితే ఈ మేరకు రాష్ట్రం లో మళ్లీ లాక్ డౌన్ విధించనున్నారు అంటూ గతంలో వచ్చిన పుకార్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుల్ స్టాప్ పెట్టిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ రాష్ట్రం లో ఒక నకిలీ ఉత్తర్వులు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. అయితే తెలంగాణ రాష్ట్రం లో మళ్లీ లాక్ డౌన్ విధించ నున్నారు అంటూ నకిలీ ఉత్తర్వులను ఇచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు. గత నాలుగు రోజులు క్రిందట సంజీవ్ కుమార్ అనే ఒక వ్యక్తి లాక్ డౌన్ కి సంబందించి నకిలీ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఆ జీఓ కాస్త సోషల్ మీడియా లో వైరల్ అవ్వడం తో పోలీస్ శాఖ స్పందించింది.

అయితే అతనిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నిందితుడి మొబైల్ మరియు ల్యాప్ టాప్ ను పోలీసులు స్వాధీనం చేశారు. అయితే ఈ నిందితుడు ఒక ప్రైవేట్ కంపెనీలో చార్టెడ్ అకౌంటెంట్ గా పని చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఇలా తప్పుడు ప్రచారం చేసే వారు పై కఠిన చర్యలు తీసుకుంటాం అని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.