TSRTC కొత్త ఎండీ ఎవరో తెలుసా…?

Wednesday, October 16th, 2019, 08:08:05 PM IST

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్దీ రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. దసరా పండగ ముందు నుండే ఈ సమ్మె ప్రారంభించినప్పటికీ కూడా, పండగా తరవాత కార్మికులు వారి సమ్మె ని మరింత ఉదృతం చేశారు. అయితే కార్మికులు శతవిధాలుగా ప్రయత్నించినప్పటికీ కూడా వెనక్కి తగ్గేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. కాగా ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన జరిగినటువంటి చర్చల్లో భాగంగా… ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా ఆర్టీసీ కార్మికులు కోరుతున్నటువంటి కోరికలను తీర్చలేమని, కావున వెంటనే సమ్మె విరమించి తమ తమ విధుల్లో చేరాలని ఆర్టీసీ కార్మికులను కోరారు సీఎం కెసిఆర్.

కానీ అందుకు ఆర్టీసీ కార్మికులు ఒప్పుకోకపోవడంతో ప్రస్తుతానికి ప్రైవేట్ డ్రైవర్లను, కండక్టర్లను నియమించి రాష్ట్ర ప్రజలందరికి కూడా సేవ చేయాలనీ చెప్పిన సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రస్తుతానికి అధికారులు అలాగే కానిస్తున్నారు. అయితే ఈ విషయంలో ఆర్టీసీ కార్మికులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే బుధవారం నాడు ఉదయం హై కోర్ట్ ఇచ్చిన తీర్పు ప్రకారం, ఆర్టీసీ కార్మికులు మరియు ప్రభుత్వం మరొకసారి చర్చలు జరపాలని, ప్రభుత్వం తరపున సీఎం కెసిఆర్ ఆర్టీసీ కార్మికులకు న్యాయంగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

అయితే ఈమేరకు వీరిరువురు కూడా గురువారం నాడు మరొకసారి చర్చలు జరపనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో తెలంగాణ ఆర్టీసీ కి ఒక ఎండీ ని నియమించాలని భావించిన ప్రభుత్వం ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌, అకున్‌ సబర్వాల్‌, స్టీఫెన్‌ రవీంద్రలకు సమాచారాన్ని అందించారు. కాగా ఈ ముగ్గురిలో ఎవరికో ఒకరికి తెలంగాణ ఆర్టీసీకి ఎండీ గా నియమించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే తరువాత ఎండీ ద్వారా వారి కోరికలను తీర్చే విధంగా ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుందని సమాచారం. మరి ఈ ముగ్గురిలో ఎవరు తెలంగాణ ఆర్టీసీ కి నూతన ఎండీ గా నియమితులు అవుతారో చూడాలి మరి.