బిగ్ అప్డేట్: తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ మినహాయింపు..!

Wednesday, May 27th, 2020, 11:26:55 PM IST

తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చే బస్సులు జేబీఎస్‌తో పాటు రేపటి నుంచి ఎంజీబీఎస్‌లో ఆగేందుకు కూడా అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది.

అయితే కర్ఫ్యూ సమయంలో కూడా ఆర్టీసీ బస్సులు గమ్యస్థానం చేరడానికి అవకాశం ఇవ్వగా, బస్టాండ్లలోకి ట్యాక్సీలు, ఆటోలను కూడా అనుమతి ఇస్తారు. బస్ టికెట్ కలిగిన ప్రయాణీకులు కర్ఫ్యూ సమయంలో కూడా ప్రైవేటు వాహనాల్లో తమ ఇళ్లకు చేరుకోవచ్చని తెలపగా, హైదరాబాద్ నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి, మరికొన్ని రోజుల వరకు నగరంలో సిటీ బస్సులు నడపబోమని తేల్చి చెప్పారు. అయితే అంతర్రాష్ట్ర బస్సులను కూడా మరికొన్ని రోజుల పాటు నడిపబోమని ప్రకటించారు.