బిగ్ బ్రేకింగ్: అశ్వథామ రెడ్డి అరెస్ట్ తో ఆర్టీసీ సమ్మె పై ఉక్కుపాదం.

Friday, October 18th, 2019, 12:40:20 PM IST

తెలంగాణ రాష్ట్రవ్యాప్తం గా ఆర్టీసీ సమ్మె జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. గత రెండు రోజుల నుండి కేసీఆర్ మంత్రి వర్గ భేటీ జరుపుతున్నారు. ఆర్టీసీ సమ్మె తీవ్ర తరం అయినప్పటికీ కేసీఆర్ వాటిని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని అశ్వథామరెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేసారు. సుందరయ్య విద్యాభవన్ పార్క్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ నేపథ్యం లో తీవ్ర ఆరోపణలు మాత్రమే కాకా, ప్రభుత్వం మొండి వైఖరి మానుకొని, కార్మికులతో చర్చలు జరపాలని అన్నారు. సమ్మెని జయప్రదం చేయాలని కార్మికుల్ని కోరారు. ఎట్టి పరిస్థితులూ ఆర్టీసీ పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు.

సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షుడు పద్మనాభన్ ఆర్టీసీ సమ్మె గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కార్మిక మంత్రి గా పని చేసిన కేసీఆర్ కార్మిక చట్టాలు తెలియక పోవడం బాధాకరం అని అన్నారు. అంతే కాకుండా సెల్ఫ్ డిస్మిస్ అనే పదం గూర్చి వివరణ ఇచ్చారు. సెల్ఫ్ డిస్మిస్ అనే పదం రాజ్యాంగం లోనే లేదని కేసీఆర్ కి గుర్తు చేసారు పద్మనాభన్. అంతే కాకుండా ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించిన కేసీఆర్ ఆర్టీసీ ఉద్యమాన్ని ఎలా అణచివేస్తారు? అని ఇలా చేయడం బాధాకరం అని అన్నారు.