న్యాయస్థాన నిర్ణయంపై జేఏసీ నాయకుడు ఏమన్నాడో తెలుసా…?

Wednesday, November 13th, 2019, 01:30:19 AM IST

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్దీ రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఉదృతంగా మారుతుంది. అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించడానికి ఒప్పుకోవడం లేదు. ఈంరకు సమ్మెను ఉదృతం చేస్తే ఎలాగైనా ప్రభుత్వం దిగివస్తుందన్న ఆశతో ఇటీవలే ట్యాంక్ బండ్ మీద మిలియన్ మార్చ్ ర్యాలీని నిర్వహించారు. అయితే కార్మికుల సమ్మె పరిష్కారం కావడానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి స్పందిస్తూ… న్యాయస్థాన వాఖ్యలు స్వాగతిస్తున్నామని, కమిటీ ఏర్పాటుకు తామూ అంగీకరిస్తున్నామని వెల్లడించారు.

అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి తమతో చర్చలు జరపాలని ఆయన ఆకోరారు. ఈంరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటుతో ఆర్టీసీ కార్మికులందరికీ కూడా న్యాయం జరుగుతుందని జేఏసీ నాయకుడు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే తమ సమ్మె విషయమై బుధవారం లోగ వారికి ఎదో ఒక అభిప్రాయాన్ని చెప్పాలని అడ్వేకెట్ జనరల్ ను న్యాయస్థానం ఆదేశించింది.