చలో ట్యాంక్ బండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు… అశ్వత్థామరెడ్డి

Saturday, November 9th, 2019, 03:00:59 AM IST

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్దీ రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె ప్రస్తుతానికి ఉదృతంగా మారనున్న సంగతిమనకు తెలిసిందే. అయితే శుక్రవారం నాడు కోర్టు తీర్పు కి అనుగుణంగా ఆర్టీసీ జేఏసీ నాయకుడు చలో ట్యాంక్ బండ్ ర్యాలీ ని నిర్వహించాడనికి సిద్ధమయ్యారు కూడా. అయితే శుక్రవారం నాడు హైదరాబాద్ లో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశానికి హాజరై కొన్ని సంచలనమైయున్న వాఖ్యలు చేశారు. కాగా చలో ట్యాంక్‌బండ్ నిర్వహించి తీరుతామని, ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు.

కాగా తాము చేపట్టిన ఈ సమ్మె కి అన్ని రాజకీయ పక్షాలు, విద్యార్థి, ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచాయని, తాము ఈ సమ్మె ప్రారంభించి 35 రోజులు దాటిందని ఆయన వెల్లడించారు. కాగా ఇప్పటివరకు కూడా సీఎం కేసీఆర్ ఈ విషయంలో సానుకూలంగా స్పందించడం లేదని, ఇప్పటికి కూడా కర్కశంగా వ్యవహరిస్తున్నారని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఆర్టీసీ కార్మికులకు డెడ్ లైన్ విధిస్తు కార్మికుల ఉద్యోగాలు తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు ఈ చలో ట్యాంక్ బండ్ ర్యాలీని ఏర్పాటు చేశామని, కార్మికులు, ప్రజలు పెద్ద మొత్తంలో హాజరై, ఈ ర్యాలీని విజయవంతం చేయాలనీ ఆర్టీసీ జేఏసీ నాయకుడు అశ్వత్థామరెడ్డి విజ్ఞప్తి చేశారు.